|
Article on other languages:
|
కోణార్క్ దేవాలయంలో సూర్య భగవానుని రథచక్రం
చక్రం (ఆంగ్లం: Wheel) మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది ఒక ఆక్సిస్ చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా మరియు ఎన్నోరకాల యంత్రాలలో చక్రాలు విరివిగా వాడబడుతున్నాయి. ఆక్సిల్ సహాయంతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో ఘర్షణ లేదా రాపిడి తగ్గుతాయి.
చక్రం పుట్టుకచక్రం అనే పదం ప్రోటో-ఇండో-యూరోపియన్ భాష నుండి ఉద్భవించినది. ఈ భాషలో *kwel- అనగా తిరగడం లేదా కదలడం అని అర్థం. దీని నుండి ఉద్భవించిన *kwekwlo-,[1]అనే పదం సంస్కృతంలో చక్ర మరియు పర్షియన్ భాషలోని చర్ఖ్ పదాలకు మూలంగా గుర్తించబడినది.[2] చక్రాల ఆవిర్భావంచక్రం పురాతన సుమర్(ఈ నాటి ఇరాక్)లో దాదాపు క్రీ.పూ. 5వ మిలీనియంలో కుమ్మరి పనికై, కుండలు తయారు చేయడానికి మొదటగా వాడబడినదని అనుకుంటారు[ఆధారం కోరబడినది]. క్రీ.పూ. 3వ మిలీనియంలో వెల్లివిరిసిన సింధూలోయ నాగరికతతో చక్రం వాడుక భారత దేశంలో ఆరంభమైనది[ఆధారం కోరబడినది]. కాకేసస్‌కు ఉత్తరభాగంలో బయలు పడిన సమాధుల ఆధారంగా క్రీ.పూ. 3700 సంవత్సరాలలో వాగన్లు (నాలుగు చక్రాలు) మరియు బండ్ల(రెండు చక్రాలు)తో సహా మనుషులను సమాధి చేసే వారని తెలుస్తుంది. ఇప్పటి పోలండ్‌లో లభించిన సుమారుగా క్రీ.పూ. 3500 సంవత్సరాల క్రితంనాటి చిత్రాలను బట్టి వాగన్లను చిత్రించిన అతి పురాతనమైన చిత్రంగా బ్రోనోసైస్ పాట్‌ను పేర్కొంటారు. [3] రథాల వాడుకను బట్టి చక్రాలు చైనాలో క్రీ.పూ. 1200 నుండి ఉన్నట్టు తెలుస్తుంది [4]. కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం చక్రాలు మరియు ఆక్సిల్ యూరోప్‌లోనే ఆవిర్భవించాయి. [5] చక్రాలు కలిగిన అతి ప్రాథమికమైన వాగన్‌గా "ట్రాగా న పూలి" అనబడే స్లెడ్జ్‌ని చెప్పుకొస్తారు. మానవజాతి వలసలు వెళ్ళడం ద్వారాను, ఇతర పరిచయాల ద్వారాను ఈ ఆవిష్కరణ కాస్పియన్ మరియు నల్ల సముద్రాల ప్రాంతాల వారికి తెలిసింది. అక్కడినుండి క్రీ.పూ 4వ మిలీనియంలో మెసపొటేమియాకు చేరింది. వాడుక మరియు పనితనంచక్రం (ఆక్సిల్‌తో సహా) ఒక సరళ యంత్రం (సింపుల్ మషీన్). చక్రాలు ఆక్సిల్ సహాయంతో ఉపయోగించబడినపుడు కొన్ని సార్లు చక్రం ఆక్సిల్ మీద ఇతర శక్తుల సహాయంతో తిరుగుతుంది లేదా చక్రం ఆక్సిల్‌ని తిప్పుతుంది. ప్రకృతిలో చక్రాలు
పురాణాలలో
చక్రాల సహాయంతో నడిచేవివాహనాలుచిహ్నాలుగా చక్రాలు
భారత జాతీయ పతాకంలో అశోక చక్రం.
చక్రం అనే పదం సాంప్రదాయపరంగా మతపరంగా జీవిత చక్రం లేదా కాలచక్రం వంటి విషయాలను వ్యక్తీకరించడంలో విరివిగా ఉపయోగించబడుతుంది. చక్రం భారత జాతీయ పతాకంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ చక్రం ధర్మానికి చిహ్నం. మూలాలు
|
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.